Sakala Devatha Vedokta Shanti (Navagraha Shanti Poojas) - Telugu

జయ గురు దత్త

శ్రీ గణపతి సచ్చిదానంద సద్దురుభ్యో నమః

శ్రీ దత్త విజయానందతీర్థ గురుభ్యో నమః

 

సకల దేవతా వేదోక్త శాంతి

(నవగ్రహ  శాంతి  సేవలు)

 

సద్గురు కరుణ అపారమైనది. సద్దురువు ఎల్లప్పుడూ తన శిష్యులు తమ నిజజీవితంలో అన్ని సమస్యలను అధిగమించి, ఆధ్యాత్మికమార్షంలో ముందుకు సులభంగా నడిచే లాగా దిశానిర్దేశం చేస్తారు. సమస్యలను తొలగించ గల ధర్మయుక్తమైన కోరికలను నెరవేర్చ గల వైదికకర్మాచరణయుక్క ఆవశ్యకతను స్వయంగా శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీవారు మనందరికోసం ఆచరిస్తూ, మన అందరిలో ధర్మశ్రద్ధను పెంపొందిస్తూ, వున్నారు.

 

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి “కరోనా” సమయంలో, భక్తులందరూ తమ అవసరాలకు అనుగుణంగా, తమ తమ “పుట్టిన రోజులకు, పండుగ రోజులకు, విశేషరోజులకు” నవగ్రహశాంతి ఇత్యాది వైదికకార్యక్రమాలను తాము ప్రపంచంలో ఎక్కడ వున్నా సద్గురు సన్నిధిలో మైసూరు ఆశ్రమంలో సంపూర్ణంగా ఆచరింపచేసుకొనే ఒక ప్రణాళికను రూపొందించారు.

 

పూజ్య గురుదేవులు వివిధ వైదికకార్యక్రమాలను దత్తపీఠవిద్వాంసుల ద్వారా “online” మాధ్యమంలో సేవాకర్తలే స్వయంగా వీక్షిస్తూ, కార్యక్రమము జరుపుకొనుటకు అవకాశం కల్పిస్తున్నారు. ఎవరు ఈ కార్యక్రమములను ఈ పద్ధతి ద్వారా ఆశ్రమములో జరిపించుకుంటారో, ఆ భక్తుల పక్షాన వారి కార్యక్రమ వివరాలను ప్రార్థనలను తెలియచేస్తూ, పుష్పహారసమర్పణలను పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారికి, శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీవారికి, అందించటం జరుగుతుంది. స్వామీజీవారలు ఇరువురూ కూడా ఆ రోజున ఏ ప్రాంతంలో వున్నప్పటికీ, మీ కార్యక్రమవివరాలు తెలియచేయవలసిందిగా శ్రీఅప్పాజీవారు ప్రత్యేకంగా సూచించారు.

 

 

కార్యక్రమ వివరాలు - వాటి ఖర్చులు

01. గణపతి హోమం – 3,500

02. నవగ్రహ హోమం – 4,000

03. నక్షత హోమం - 3,000

04. ఆయుష్య హోమం - 5,000

05. మృత్యుంజయ హోమం - 5,000

06. బాలారిష్ట హోమం - 5,000

07. సుదర్శన యాగం – 5,000

08. చండీ యాగం - 15,000 (అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, రోజులలో మాత్రమే)

09. లక్ష్మీకుబేర హోమం - 5,000

10. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం – 7,500

11. ఇష్ట దేవతా పూజ - 2,000

12. జన్మదిన స్తూప పూజ – 1,500

18. సత్యనారాయణ స్వామి వ్రతం - 8,000

14. జ్యేష్టా దేవీ వ్రతం - 2,000

15. హనుమత్‌ వ్రతం - 3,000

16. దుర్గాదీప పూజ - 3,500

17 సుందరకాండ పారాయణం - 5,000

18. మన్యుసూక్త పారాయణం - 2,000

19. త్రిచవిధాన సూర్యనమస్కారము - 5,000

20. సర్పశాంతి - 7,000

21. ఆశ్లేష బలి పూజ (ఆశ్లేష నక్షత్రం రోజున) - 10,000

22. ఉదక శాంతి - 9,000

23. అనఘాష్టమి వ్రతం - 3,000

24. ఒక రోజు వేదవిద్యార్థులకు అన్నదానం - 32,000

 

 

జాతకరీత్యా దోషనివారణ శాంతులు

మీ జాతకమును క్షుణ్ణంగా పరిశీలన చేసి, అవసరమైన గ్రహ జప, హోమ, తర్పణ, దానములతో సహా శాంతి కర్మలు నిర్వహించబడును.

 

సంపూర్ణ నవగ్రహ శాంతి

 

గ్రహం    -      ఖర్చు

రవి         -     10,500

చంద్ర    -     12,500

కుజ        -     10,500

బుధ       -     15,500

గురు       -     15,500

శుక్ర        -     17,500

శని         -     17,000

రాహు     -     17,000

కేతు       -     10,500

 

 

కార్యక్రమ వివరాలు - వాటి ఫలితాలు

  1. గణపతి హోమం - విద్య, ఉద్యోగ, వ్యాపార, సకలకార్యప్రారంభమునకు, సర్వవిఘ్న నివారణకు
  2. నవగ్రహ హోమం - గ్రహబాధలనుంచి విముక్తికై
  3. ఆయుష్య హోమం - పుట్టిన రోజుకు
  4. మృత్యుంజయ హోమం - అకాలమృత్యుభయ నివారణకు
  5. బాలారిష్ట హోమం -  చిన్నపిల్లల ఆరోగ్యం కోసం
  6. సుదర్శన యాగం - శత్రుబాధా పరిహారం
  7. చండీ యాగం - విజయప్రాప్తి
  8. లక్ష్మీకుబేర హోమం - ఐశ్వర్యప్రాప్తి
  9. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం - శివప్రీత్యర్థం
  10. జన్మదినస్తూప పూజ - ఆశ్రమంలో ప్రతిష్టింపబడిన జన్మదిన స్తూపదేవతకి
  11.   జ్యేష్టాదేవీవ్రతం -  దారిద్ర్యనివారణ
  12. హనుమత్‌వ్రతం - సకల శుభఫలములు
  13. దుర్గాదీప పూజ - సకల భయనివారణకు
  14. సుందరకాండ వారాయణం - కార్యసిద్ధికి
  15. మన్యుసూక్త పారాయణం - నరదృష్టి ఇతర పీడా నివారణకు (Bad vibrations)
  16. త్రిచవిధాన సూర్యనమస్కారము - ఆరోగ్యం కోసం
  17. సర్పశాంతి  - సర్పదోష నివారణకు
  18. ఆశ్లేషబలి పూజ -  సర్వదేవతా ప్రీత్యర్ధం, సమస్త రోగనివారణార్థం

 

 

సేవాకర్తలకు శ్రీదత్త విజయానంద తీర్ధ స్వామీజీవారి సూచనలు

 

1. మీ కార్యక్రమములు మైసూరు ఆశ్రమంలో జరిగే రోజున, తలస్నానం చేసి,

కార్యక్రమం ముగిసే వరకూ, ఉపవాసం ఆచరించుట ఉత్తమ ఫలదాయకము.

2. విదేశస్థులు ఎవరైతే సేవాకర్తలుగా వున్నారో, అవకాశాన్ని బట్టి, కార్యక్రమ

ప్రారంభానికి ముందు, లేక వారి ప్రాంత మరుసటి ఉదయం సూర్యోదయాన,

తలస్నానం, ఉపవాసం, చేయవలెను.

3. మీ కార్యక్రమములు నమోదు చేయించుకోవటానికి ముందు ఇక్కడ సూచించిన నంబర్ల ద్వారా పురోహితులతో చర్చించి, ఇతర వివరాలను తెలుసుకోగలరు.

4. ఒక వేళ ఎవరైనా రోగుల కోసం గానీ, పిల్లల కోసం గానీ, కార్యక్రమాలను

నిర్వహించే నేపథ్యంలో, పై సూచనలు పురోహితుల నిర్దశనతో సడలింపు చేసుకొనవచ్చును.

5. మీరు నమోదు చేయించుకున్న ఏ కార్యక్రమాలైనా సరే, భారతదేశకాలమానం ప్రకారం తిథి, వార, నక్షత్ర, తేదీలను, అనుసరించి నిర్వహించబడును.

6. ఈ వైదికకార్యక్రమాలు అన్నీ కూడా కేవలం అవధూత దత్తపీఠం ట్రస్ట్‌ ద్వారానే జరుగుతాయి.

7. ఈ వైదికకార్యక్రమాలు అవధూత దత్తపీఠంలో చేయించుకొనదలచినవారు ఈ క్రింది నంబరులను మాత్రమే సంప్రదించవలెను.

 

Contact:

1. Kalyan Kiran Sharma - 9880304350

2. Chakravarthy Sharma - 9972134324